SanitationDrive | బాలికల వసతి గృహంలో మంత్రి సీతక్క

SanitationDrive | బాలికల వసతి గృహంలో మంత్రి సీతక్క

SanitationDrive | ఆంధ్రప్రభ, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డ షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహంలో నిర్వహించిన మెగా శానిటేషన్ డ్రైవ్‌లో రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి వసతి గృహాన్ని సందర్శించిన మంత్రి, అక్కడి పరిశుభ్రత పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా వసతి గృహంలోని గదులు, పరిసరాలను తనిఖీ చేసిన మంత్రి సీతక్క విద్యార్థినులకు మెరుగైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి పరిశుభ్రత అత్యంత ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వికాస్ మీనా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, డీఈవో సిద్ధార్థ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, కో-ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.