శరీర ధారుఢ్యానికి క్రీడలు ఎంతో ముఖ్యం
శరీర ధారుఢ్యానికి క్రీడలు ఎంతో ముఖ్యం
టీడీపీ యువ నాయకుడు బొండా సిద్దార్ధ
పాయకాపురం, ఆంధ్రప్రభ : శరీర ధారుఢ్యానికి క్రీడలు ఎంతో ముఖ్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు యువ నాయకుడు బోండా సిద్ధార్థ అన్నారు.ఎన్. వి.ఎస్.ఎల్.ఎం శర్మ మొదటి మెమోరియల్ ఏపీ, టిజి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అజిత్ సింగ్ నగర్ ఎమ్.కె బేగ్ హై స్కూల్ అవరణలో గత రెండు రోజులుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు యువ నాయకుడు బోండా సిద్ధార్థ పాల్గొని టోర్నమెంట్లో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలచిన జట్టుకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు యువ నాయకుడు బోండా సిద్ధార్థ పాల్గొని ఎన్.వి.ఎస్. ఎల్. ఎన్ శర్మ మెమోరియల్ ఏపీ, టిజి శర్మ జ్ఞాపకార్ధం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.రెండు రాష్ట్రాల్లో క్రీడాకారులను ఇక్కడకు రప్పించి,ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వాహకులను సిద్దార్ధ అభినందించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు వి వెంకటేశ్వరరావు, చీఫ్ అంపైర్ ఎమ్.వి.ఎన్. రాజు, ఎస్. మురళీ కృష్ణ, స్కూల్ ప్రధానోపాధ్యాయులు మైనం హుస్సేన్,ఆర్గనైజింగ్ సెక్రటరీ కె రాజేంద్రబాబు, ఎస్.వి.రావు,టీడీపీ నాయకులు ఎస్. కె గౌసియా, రాజానా బంగారు నాయుడు, బుదాల సురేష్,మరకా శ్రీనివాసరావు, లుర్దు రాజు తదితరులు పాల్గొన్నారు.
