ఈ నెల 13న గూడెం దేవస్థానానికి ఉపముఖ్యమంత్రి రాక
ఈ నెల 13న గూడెం దేవస్థానానికి ఉపముఖ్యమంత్రి రాక
- ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
దండేపల్లి, ఆంధ్రప్రభ : ఈ నెల 13న దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు రానున్నారు,ఈ సందర్భంగా గోదావరి పుష్కర నిధుల నుండి 58 కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణానికి, నీటి పారుదల శాఖ ద్వారా 75 కోట్ల రూపాయలతో గూడెం, ద్వారక, గుడిరేవు, మోదెల ప్రాంతాల్లో చిన్న ఎత్తిపోతల పథకాలకు వీరు శంకుస్థాపన చేస్తారని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపినట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు గడ్డం త్రిమూర్తి వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోని ఆలయానికి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో నిధులు తీసుక రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు నాలుగు ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయించడం, విద్య , వైద్య రంగాల్లో నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, రైతులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు.మాజీ ఎంపిటిసి సభ్యులు ముత్యాల శ్రీనివాస్,స్థానిక సర్పంచ్ రాజేశ్వర్ నాయక్, ఉపసర్పంచ్ సిరికొండ నవీన్, కట్కూరి రాజన్న, దేవా లక్ష్మణ్, అశోక్ నాయక్, కొండు గోపాల్, బొలిశెట్టి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
