JAAC | 16 మంది మృతి
JAAC | 16 మంది మృతి
JAAC | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీల తగ్గింపును డిమాండ్ చేస్తూ ఈద్గా మైదానంలో వేలాది మంది ప్రజలు శాంతియుతంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు కాల్పులకు దిగినట్లు సమాచారం.
ఈ ఘటనలో 16 మంది మరణించగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ)పై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనల్లోనూ భద్రతా బలగాలు జోక్యం చేసుకున్నాయి. ఆ ఘటనలో కూడా పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
వరుస ఘటనలతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా బలగాల చర్యలపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
