రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కాటన్ బ్యాగుల పంపిణీ..

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కాటన్ బ్యాగుల పంపిణీ..

నిజామాబాద్ సాంస్కృతికం, (ఆంధ్రప్రభ): రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కాటన్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు పాకాల నరసింహారావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని, ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమవుతుందని పేర్కొన్నారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, దైనందిన జీవితంలో కాటన్ బ్యాగులను ఉపయోగించాలని ఆయన సూచించారు. కూరగాయలు, ఇతర వస్తువులు తీసుకెళ్లేందుకు కాటన్ బ్యాగులు వాడడం ద్వారా పర్యావరణంతో పాటు పశువుల ఆరోగ్యాన్ని కూడా కాపాడవచ్చని తెలిపారు.

నిజామాబాద్ నగరంలోని గంజి కూరగాయల సంతలో వినియోగదారులకు ఉచితంగా కాటన్ బ్యాగులు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గంజి రమేష్, గిరీష్ కుమార్, విజయ్ గంగుల, రమేష్, సుధాకర్, సంపత్, రాజశేఖర్, శిరీష్ కుమార్ తదితరులు, వ్యాపారులు పాల్గొన్నారు.

Leave a Reply