Bapatla-Old-Bus-Stop : బాపురే.. బాపట్ల ..! Andhra Prabha News

Bapatla-Old-Bus-Stop : బాపురే.. బాపట్ల ..! Andhra Prabha News

  • ఇది జనం​ షెల్డర్​ కాదు..
  • అవస్థల విడిది
  • బస్సు కోసం పడిగాపులే
  • వానలో తడవాల్సిందే
  • ఎండలో మగ్గాల్సిందే

( బాపట్ల , ఆంధ్రప్రభ)

Bapatla-Old-Bus-Stop : బాపట్ల ఓల్డ్ బస్‌స్టాప్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బాపట్లలో బస్సు ఎక్కాలంటే ఎండకు ఎండాలి, వానకు తడవాలి, చలికి వణకాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త బస్టాండ్ కు వెళ్లాలంటే ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న రైలు పెట్టే లాగా ఉండే బస్‌షెల్టర్ ఉదయం 6 గంటల వరకు తీయకపోవడంతో ప్రయాణికులు రోడ్డు పక్కనే నిలబడి బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని, ప్రయాణికులకు రక్షణ కల్పించే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.

Leave a Reply