Irumudi | ఆగ‌స్టు 21న ఇరుముడి

Irumudi | ఆగ‌స్టు 21న ఇరుముడి

ర‌వితేజ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్‌

Irumudi | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు శివ నిర్మాణ తెరకెక్కిస్తున్న ఇరుముడి సినిమాను ఆగ‌స్టు 21న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధినేత‌లు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్. ర‌వితేజ కూతురిగా న‌క్ష‌త్ర క‌నిపించ‌నుంది. అయ్యప్ప స్వామి మాలధారణతో ఉన్న రవితేజను ఫస్ట్ లుక్‌ పోస్టర్‌గా విడుదల చేశారు. అది ఆడియన్స్ అందరిలోనూ క్యూరియాసిటీని పెంచింది. ఇటీవ‌ల విడుద‌లైన గ్లింప్స్ ఆక‌ట్టుకుంది.

Leave a Reply