School Reopening | రెండో శనివారం, ఆదివారం కారణంగా షెడ్యూల్‌లో మార్పు

School Reopening | రెండో శనివారం, ఆదివారం కారణంగా షెడ్యూల్‌లో మార్పు

School Reopening | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తెలంగాణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ తేదీలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. రాష్ట్రంలోని పాఠశాలలు ఈ నెల 15వ తేదీ నుంచి పునఃప్రారంభం కానున్నాయి.

వాస్తవానికి పాఠశాలలు జూన్ 12న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే జూన్ 13న రెండో శనివారం, జూన్ 14న ఆదివారం సెలవులు ఉండటంతో విద్యాశాఖ షెడ్యూల్‌ను సవరించింది. వరుసగా సెలవులు రావడంతో పాఠశాలల ప్రారంభాన్ని జూన్ 15కు వాయిదా వేసింది.

జూన్ 13న రెండో శనివారం సెలవును సర్దుబాటు చేసే క్రమంలో జులై 11న (రెండో శనివారం) పాఠశాలలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Leave a Reply