గుడి రేవులో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఘన సన్మానం

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం లోని గుడిరేవు గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో, విద్యా రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించిన నలుగురు విద్యార్థులను, అలాగే క్రీడా పాఠశాలలో సీటు సాధించిన విద్యార్థినిని గ్రామ సర్పంచ్ కళావతి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కళావతి మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచే లక్ష్యంతో చదివితేనే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని, గ్రామ స్థాయి నుంచి ఇలాంటి ప్రతిభావంతులు రావడం గర్వకారణమని కొనియాడారు.

విద్యార్థులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లూరి శ్రీనివాస్, బొలిశెట్టి బుచ్చన్న, ఉపాధ్యాయులు బండారి శ్రీనివాస్, శ్యామల, ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వరూప, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారిని, అంగన్వాడి టీచర్ లక్ష్మి, ప్రీ ప్రైమ్ ఇన్స్ట్రక్టర్ ధనలక్ష్మి,చిట్ల శ్రీనివాస్,బొమ్మేన మహేష్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply