Gold Prices | బంగారం, వెండి భారీగా పతనం

Gold Prices | బంగారం, వెండి భారీగా పతనం

Gold Prices | ఆంద్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : దేశీయ బంగారం, వెండి మార్కెట్లు వరుసగా పతనం చెందుతున్నాయి. బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈ వారం నిజంగా గోల్డెన్ డేస్‌గా చెప్ప‌వ‌చ్చు. గత మూడు రోజులుగా వరుసగా బంగారం ధరలు తగ్గుతుండటంతో పెట్టుబడిదారులు, ఆభరణాల కొనుగోలుదారులు కొంత ఊరట పొందుతున్నారు. బంగారం ధరలు క్రమంగా తగ్గడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా భారీగా పడిపోవడంతో విలువైన లోహాల మార్కెట్‌లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. గడిచిన మూడు రోజులుగా 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు బంగారం ధరల్లో కొనసాగుతున్న తగ్గుదల మార్కెట్లో కొత్త సవాళ్లను సృష్టిస్తోంది.

ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,730గా నమోదైంది. నిన్నటి మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.3,000 మేర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,40,000గా ఉంది, ఇది రోజు వారీగా రూ.2,750 తగ్గడం. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,14,500కు పడిపోయింది, రోజువారీ తగ్గుదల రూ.2,250.

వీటితో పాటు వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండి ధర ఈ రోజు 10వేల రూపాయ‌లు త‌గ్గి ప్రస్తుతం రూ.2,65,000కు దిగింది. గడిచిన కొన్ని రోజులలో రూ.20,000 వరకు తగ్గుదలని నమోదు చేసింది.

Leave a Reply