మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలి…

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నర్సింహులపేట ఎస్ఐ బానోత్ వెంకన్న అన్నారు.శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మాదక ద్రవ్యాల వినియోగంతో యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబాలు,సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు భాగంగా ప్రత్యేక పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసిందని గంజాయి సేవించి గుర్తింపునకు ఉపయోగపడే గంజాయి గుర్తింపు టెస్టు కిట్లను పోలీస్ స్టేషన్ లో ఉంచామని,ఇకపై గంజాయి సేవిస్తే తెలిసిపోతుందని అన్నారు.గంజాయి రవాణా,విక్రయం,వినియోగం చేస్తే సమాచారం అందించాలని,వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని మత్తు పదార్థాల నివారణకు ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు.

Leave a Reply