సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలు
సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలు
- ఉద్యోగుల పిల్లల కోసం 150 సీట్లు: జీఎం శ్రీరమేష్
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు బెల్లంపల్లి ఏరియా జీఎం ఎం. శ్రీరమేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కళాశాలలో సింగరేణి ఉద్యోగుల వారసుల కోసం ప్రత్యేకంగా 150 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఇందులో సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్ విభాగాలకు ముప్పై సీట్ల చొప్పున కేటాయించామని పేర్కొన్నారు. ఈ సీట్లలో ప్రవేశాలకు కేవలం సింగరేణి ఉద్యోగుల పిల్లలు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 8 వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం https://scp.scpolytechnic.com/counseling/ వెబ్‌సైట్‌ను గానీ, లేదా 8790112515, 9908151618, 9010222161 ఫోన్ నెంబర్లను గానీ సంప్రదించాలని జీఎం కోరారు.
