వేటా కార్యక్రమాలకు మంత్రి సీతక్కకు ఆహ్వానం..

తొర్రూరు, ఆంధ్రప్రభ : మహిళల సాధికారత కోసం కొన్ని ఏళ్లుగా కృషి చేస్తున్న వేటా సంస్థ కార్యక్రమాలకు హాజరుకావాలని సంస్థ అధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి రాష్ట్ర మంత్రి సీతక్కకు ఆహ్వాన పత్రిక అందించారు.గురువారం హైదరాబాదులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఝాన్సీ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.వేటా ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను మంత్రికి వివరించారు.జూన్ నెలలో ప్రారంభం కానున్న ఉమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ –ఇండియా (వేటా) కార్యక్రమాలు ఇండియాలో సైతం విస్తృతంగా కొనసాగిస్తామని ఝాన్సీ రెడ్డి తెలిపారు.

మహిళల సాధికారత, స్వయం ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఝాన్సీ రెడ్డి తెలిపారు.మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత బలపడేలా పలు అవగాహన కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు మరియు సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అలాగే కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరై విజయవంతం చేయాలని మంత్రి సీతక్క గారిని ఆహ్వానించారు..
ఈ భేటీలో మహిళా సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, యువత సాధికారత తదితర అంశాలపై కూడా చర్చించారు.

Leave a Reply