June12th | సక్సెస్ అయితే రాష్ట్రమంతటా!

June12th | సక్సెస్ అయితే రాష్ట్రమంతటా!

June12th | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : చిన్నారుల ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారాన్ని మరింత మెరుగ్గా అందించాలనే లక్ష్యంతో, ప్రభుత్వం సరికొత్త ‘అల్పాహార పథకాన్ని’ ప్రవేశపెట్టనుంది. కేవలం భోజనానికే పరిమితం కాకుండా, రోజును ఆరోగ్యకరమైన అల్పాహారంతో ప్రారంభించేలా ఈ పథకాన్ని రూపొందించారు.

చిన్నారుల ఎదుగుదలకు బాల్యంలోనే సరైన పోషకాహారం అందడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అంగన్‌వాడీలకు వచ్చే పిల్లలలో పోషకాహార లోపాన్ని నివారించి, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ఈ పథకం జూన్ 12వ తేదీ నుండి అధికారికంగా ప్రారంభం కానుంది. ముందుగా రాష్ట్రవ్యాప్తంగా కాకుండా, ఎంపిక చేసిన ఆదిలాబాద్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ‘పైలట్ ప్రాజెక్టు’గా దీనిని అమలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రతిరోజూ పౌష్టికాహారంతో కూడిన అల్పాహారాన్ని అందించనున్నారు. ప్రస్తుతం రెండు జిల్లాల్లో అమలు చేస్తున్న ఈ పథకం యొక్క ఫలితాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలించనుంది.

Leave a Reply