పెద్ది రియల్ టాక్..
పెద్ది రియల్ టాక్..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన సినిమా పెద్ది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అవ్వడంతో.. పెద్ది పై మెగా అభిమానులు మాత్రమే కాదు.. చరణ్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పెద్ది పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈరోజు పెద్ది వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజైంది. మరి.. పెద్ది చరణ్ నమ్మకాన్ని నిలబెట్టిందా…? లేదా..? పెద్ది రియల్ టాక్ ఏంటి..?
పెద్ది కథ గురించి చెప్పాలంటే..
దాదాపుగా 148 కోట్లకు పైగా ఉన్న భారతదేశం.. ఒలింపిక్స్ లో మాత్రం ఒకటి లేదా రెండు మెడల్స్ మాత్రమే సాధిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది..? ఎందుకు ఇండియన్స్ స్టోర్ట్స్ పై యూత్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని.. మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన ఆఫీసర్ (బొమన్ ఇరానీ) తెలుసుకోవాలి అనుకుంటాడు. ఆయన తన ప్రయాణంలో విజయనగరానికి చెందిన పెద్ది (చరణ్) గురించి తెలుసుకుంటాడు. పెద్ది మల్టీ స్పోర్ట్స్ ఆటగాడు. క్రికెట్, కుస్తీ, పరుగు పందెం.. ఇలా మూడింట్లో కూడా పెద్ది పేరు మారుమోగడం చూసి ఆశ్చర్యపోతాడు. అసలు ఎవరీ పెద్ది…? గెలుపు కోసం పెద్ది చేసిన పోరాటం ఏంటి..? పెద్ది ప్రయాణంలో ఎన్ని కష్టాలు, బాధలు పడ్డాడు…? చివరికి గెలుపు కోసం ఏం చేసాడు… అనేదే పెద్ది కథ.

రియల్ టాక్..
పెద్ది పాత్ర కోసం చరణ్ చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం తెర పై కనిపించింది. క్రికెట్, కుస్తీ, రన్నింగ్.. ఈ మూడు ఆటల్లో నటించేందుకు చరణ్ తనని తాను మలుచుకున్న తీరు అద్భుతం. ఒక్క మాటలో చెప్పాలంటే.. చరణ్ నటించలేదు.. జీవించాడు అని సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెబుతున్నారు. బుచ్చిబాబు ఈ కథను అందరికీ కనెక్ట్ అయ్యేలా అద్భుతంగా తెరకెక్కించాడు. చరణ్, బుచ్చిబాబు తర్వాత చెప్పుకోవాల్సింది.. సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ గురించే. ఈ సినిమాకి రెహమాన్ సంగీతం అనగానే.. ఈమధ్య కాలంలో ఫామ్ లో లేడు.. సరైన మ్యూజిక్ అందిస్తాడో లేదో అనే అనుమానాలు ఉండేవి. టీజర్ అండ్ ట్రైలర్ లో మ్యూజిక్ తో మెప్పించిన రెహమాన్ ఈ సినిమాలో రీ రికార్డింగ్ తో అదరగొట్టాడు అనే టాక్ వినిపిస్తోంది. ప్రతి సీన్ కి పర్ ఫెక్ట్ అనేలా రీ రికార్డింగ్ అందించారు అనే టాక్ వచ్చింది.

జాన్వీ కపూర్ పాత్ర నిడివి తక్కువే అయినా.. పాత్రకు తగ్గట్టుగా నటించింది. కాకపోతే ఈ అమ్మడు గ్లామర్ డోస్ కాస్త ఎక్కువే అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన పాత్రలు జగపతి బాబు, శివ రాజ్ కుమార్. జగపతి బాబు ఇందులో అప్పలసూరి పాత్రలో పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పించారు. ఇంకా చెప్పాలంటే.. ఆయన కెరీర్లో మరిచిపోలేని పాత్రల్లో ఒకటిగా అప్పలసూరి పాత్ర నిలుస్తుంది. అలాగే కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ పాత్ర కూడా అదిరింది అనే టాక్ వచ్చింది. ఫస్టాఫ్ సూపర్ అనిపిస్తుంది కానీ.. సెకండాఫ్ కి వచ్చేసరికి నిడివి కాస్త తగ్గించి ఉంటే బాగుండేది.. అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. పెద్ది హిట్టు టాక్ సొంతం చేసుకుంది. అయితే.. బాక్సాఫీస్ దగ్గర పెద్ది ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.
