ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : సిద్దిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు చౌటుప్పల్ పట్టణంలో అత్యంత ఘనంగా జరిగాయి. బుధవారం స్థానిక భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… హరీష్ రావు తన నిరంతర ప్రజాసేవతో, అద్భుతమైన నాయకత్వ పటిమతో తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారని కొనియాడారు.
భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి, తెలంగాణ రాష్ట్రానికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంబరాల్లో శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయం మాజీ చైర్మన్ దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సుర్వి మల్లేష్ గౌడ్, బార్ కౌన్సిల్ అధ్యక్షులు తాడూరి పరమేష్, నాయకులు ఎమ్మెస్ గౌడ్, సతీష్, తొర్పునూరి మల్లేష్ గౌడ్, కైరంకొండ వెంకట్ నరసయ్య, కానుగు శివ, బండ్ల శ్రీకాంత్, అమీర్, మున్నా, సంగిశెట్టి శివ, అతు ఈశ్వర్, విజయ్, గంగాదేవి రమేష్, శివ, చీమకండ్ల కృష్ణయ్య, నరేంద్ర, సాగర్, రమణ, గోవి రఘు, పిల్లలమర్రి సాయి, గుండెబోయిన వెంకటేశం, కోయలగూడెం వెంకటేశం, ముసిర్ ఒమేర్, కళ్లెట్ల నాగరాజు, రెడ్డగోని మల్లేశం, ఊదరి రాకేష్ తదితరులు ఉన్నారు.
