హరీశ్ రావుకు పాటల కానుక

హరీశ్ రావుకు పాటల కానుక

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని యువ నాయకుడు వికాస్ రూపొందించిన ప్రత్యేక పాటల సీడీని మంగళవారం ఆవిష్కరించారు. మాజీ మంత్రి హరీశ్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఈ సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో హరీశ్ రావు కీలక పాత్ర పోషించారని అన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర నిర్మాణం వరకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారంలో హరీశ్ రావు చూపిన చొరవ, నిబద్ధత రాష్ట్ర ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిందని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి పట్ల హరీశ్ రావు చూపుతున్న అంకితభావం యువతకు ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఆయనకు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హరీశ్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యువ నాయకుడు వికాస్ రూపొందించిన ప్రత్యేక పాటల సీడీని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నరహరి రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, డాక్టర్ శ్రీహరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply