తుగ్గలిలో కరెంటోళ్ల జనబాట కార్యక్రమం

తుగ్గలిలో కరెంటోళ్ల జనబాట కార్యక్రమం

తుగ్గలి, ఆంధ్రప్రభ: మండల కేంద్రమైన తుగ్గలిలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్‌పీడీసీఎల్) ఆధ్వర్యంలో ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పత్తికొండ ట్రాన్స్‌కో ఏడీఈ మదన్ మోహన్, అసిస్టెంట్ ఇంజనీర్ సుజాత విద్యుత్ సేవలు, వినియోగదారుల సమస్యల పరిష్కారం, విద్యుత్ భద్రతా చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

విద్యుత్‌కు సంబంధించిన సమస్యలను ముందుగా స్థానిక విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని, అక్కడ పరిష్కారం కాకపోతే సంబంధిత ఉన్నతాధికారులకు నేరుగా తెలియజేయాలని వినియోగదారులకు సూచించారు.

విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, భద్రతా నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో లైన్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున, లైన్మెన్ వెంకటేష్ నాయక్, విద్యుత్ శాఖ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.