ఆలేరులో తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్స్ క్లబ్ లో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమకారులకు మంగళవారం ఘనంగా సన్మానం జరిగింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందడి మణిపాల్ రెడ్డి ఉద్యమకారులైన ఎర్ర జాన్సన్, పూల నాగయ్య, తమ్ముడి పద్మారావు, మొగుళ్ల దేశాయిరెడ్డి, ఆడెపు బాలస్వామి, మందుల విజయ లను సన్మానించారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశం మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు మణిపాల్ రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో స్థానికులు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply