అంగరంగ వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

అంగరంగ వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పెద్దపల్లి కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి నివేదిక పై ప్రసంగించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో విధుల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులకు సేవా పురస్కారాలు విప్ విజయ రమణారావు అందించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రామ్ రెడ్డి, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply