ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి ఒకరి మృతి

ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండల కేంద్రంలోని జటాశంకర్ సమీపంలో తానుర్ కు వెళ్ళే రోడ్డులో ఒకరు బైక్ అదుపుతప్పి చనిపోయినట్లు ఎస్. ఐ బిట్ల పెర్సిస్ తెలిపారు. ఎస్. ఐ తెలిపిన వివరాల ప్రకారం… మృతుడు మిసడే సంతోష్(సతీష్) ఆదివారం ఉదయము తానూర్ మండల కేంద్రంలోని తన స్వగృహం నుండి కూలి పని నిమిత్తం లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామానికి వెళ్ళాడన్నారు. పనులు ముగిసాక రాత్రి తిరుగు ప్రయాణంలో ముధోల్ లోని తానూర్ రోడ్డుకు పక్కన గల మట్టి కుప్పకు ఢీ కొని మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య మిసడే శుష్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ముధోల్ ఎస్.ఐ తెలిపారు.

Leave a Reply