Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న సీఎం

Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న సీఎం
Indiramma Houses | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి నేడు (సోమవారం) కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 5.45 గంటలకు కెరమెరి మండలం కొత్తారి గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ‘ఇందిరమ్మ ఇల్లు’ గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించనున్నారు.
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రారంభోత్సవానికి సూచికగా కొత్తారి గ్రామంలో పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్స్‌కు చేరుకుంటారు. అక్కడ జిల్లాకు సంబంధించి పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు.సభ అనంతరం హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నారు.
