Orange Cap | వైభవ్ లైన్ క్లియర్..

Orange Cap | వైభవ్ లైన్ క్లియర్..
- ఆరెంజ్ క్యాప్ అందుకోవాలంటే కోహ్లీకి అసాధ్యమైన టాస్క్!
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరిన వేళ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ప్రతిష్టాత్మక ‘ఆరెంజ్ క్యాప్’ రేసు అత్యంత ఆసక్తికరంగా మారింది. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ త్వరగానే కుప్పకూలడంతో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఆరెంజ్ క్యాప్ రేసు క్లియర్ అయిపోయింది.
దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు వైభవ్. రాజస్థాన్ రాయల్స్ లోని 15 ఏళ్ల బీహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్రలో అత్యంత పిన్న వయసులోనే ‘ఆరెంజ్ క్యాప్’ (Orange Cap) విజేతగా నిలిచాడు.
ఈ సీజన్లో కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుత ఫామ్‌తో దూసుకెళ్లిన వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచుల్లో 776 పరుగులు చేసి ప్రస్తుతం చార్ట్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, అతని స్థానాన్ని సవాల్ చేసే స్థితిలో ఉన్న గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్ (722 పరుగులు), సాయి సుదర్శన్ (710 పరుగులు) కీలక మ్యాచ్‌లో పెద్ద స్కోర్లు చేయలేకపోయారు.
రేసులో కోహ్లీ..
ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ రేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కూడా నిలిచాడు. విరాట్ కోహ్లీ 15 ఇన్నింగ్స్‌ల్లో 600 పరుగులు చేసి (1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో) జాబితాలో 6వ స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా నాలుగు సీజన్లలో 600 ప్లస్ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా కోహ్లీ సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. అయితే, కోహ్లీ ఈసారి ఆరెంజ్ క్యాప్ సాధించాలంటే కేవలం 150+ పరుగులు చేయాల్సిం ఉంటుంది. వైభవ్ సూర్యవంశీ (776) స్కోరును అధిగమించాలంటే కోహ్లీ ఇంకా 177 పరుగులు చేయాల్సి ఉంటుంది.
1 వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ 16 776
2 శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ 15 722
3 సాయి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్ 16 710
4 హెన్రిచ్ క్లాసెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 624
5 ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 602
6 విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15 600
