Mahesh Babu | బర్త్‌డే స్పెషల్‌గా థియేటర్లలోకి ప్రిన్స్ క్లాసిక్ సినిమాలు

Mahesh Babu | బర్త్‌డే స్పెషల్‌గా థియేటర్లలోకి ప్రిన్స్ క్లాసిక్ సినిమాలు

Mahesh Babu | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఆయన పుట్టినరోజు (ఆగస్టు 9) వస్తుందంటే, తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ పండుగ వాతావరణాన్ని తలపిస్తాయి. ప్రస్తుతం మహేష్ బాబు – రాజమౌళి ప్రాజెక్ట్ వారణాసి సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. అయితే సినిమా 2027లో రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఆ సినిమా రావడానికి సమయం ఉండటంతో అభిమానులకు ఆ లోటును భర్తీ చేయడానికి మహేష్ బాబు పాత బ్లాక్‌బస్టర్ సినిమాలను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఎందుకు ఈ రీ-రిలీజ్ హడావుడి?
గత కొంతకాలంగా మహేష్ బాబు అభిమానులు తమ అభిమాన హీరో సినిమాలను బిగ్ స్క్రీన్‌పై చూసి చాలా కాలమైందని, ఆ ఎనర్జీని మళ్లీ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో, మహేష్ బాబు తదుపరి చిత్రం రాజమౌళి దర్శకత్వంలో భారీ స్థాయిలో రూపొందుతుండటం వల్ల, షూటింగ్ అప్‌డేట్స్ కోసం అభిమానులు వేచి చూడాల్సి వస్తోంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి, బర్త్‌డే సందర్భంగా తన పాత చిత్రాలను మళ్లీ థియేటర్లలో చూడాలన్నది అభిమానుల ప్రధాన ఉద్దేశ్యం.

థియేటర్లలో సందడి చేయబోతున్న చిత్రాలు..

మహేష్ బాబు కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిన కొన్ని చిత్రాలు రీ-రిలీజ్ కోసం సిద్ధమవుతున్నాయి. అందులో ఇప్పటికే మురారీ, పోకిరి, నేనొక్కడే, ఒక్కడు, అతడు వంటి సినిమాలు ఇప్పటికే రీ- రిలీజ్ అవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అయితే ఆగష్టు 9 న మహేష్‌ బాబు బర్త్‌ డే కావడంతో తమ అభిమాన హీరో సినిమా కోసం అందురు చూస్తున్నారు. కాగా నేడు మహేష్‌ బాబు తండ్రి కృష్ణ జయంతి సందర్భంగా మేకర్స్ మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఆగష్టు 7 మహేష్‌ కేరియర్ లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బాస్టర్‌ సినిమా దూకుడు ను రీ -రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు.

Mahesh Babu

ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ గ్రూపులు ఈ సినిమాల రీ-రిలీజ్ కోసం భారీగా సన్నాహాలు చేస్తున్నాయి. థియేటర్ల దగ్గర భారీ కటౌట్లు, సోషల్ మీడియాలో ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు, వినూత్నమైన ప్రమోషన్లతో ఈ పుట్టినరోజును మహేష్ బాబు కెరీర్‌లోనే ఒక గుర్తుండిపోయేలా చేయాలని అభిమానులు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మహేష్‌ సినిమా అతిథి మే 30 రిరీలీజ్‌ కావడం.. అభిమానుల సంబరాలు చేసుకుంటుంటే ఇప్పుడు దూకుడు రీ -రిలీజ్‌ తో ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేవు.

రాజమౌళి సినిమా కోసం ఎదురుచూస్తూనే, మహేష్ బాబు పాత జ్ఞాపకాలను వెండితెరపై మరోసారి ఎంజాయ్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఈ ఆగస్టు 7న థియేటర్ల వద్ద ప్రిన్స్ మేనియా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి!

CLICK HERE TO READ Tollywood Work Culture | వర్క్ కల్చర్‌పై జాన్వీ క‌పూర్ ప్ర‌శంస‌లు

CLICK HERE TO READ MORE

Leave a Reply