Robbery | షిర్డీలో రెచ్చిపోయిన దోపిడీ దొంగ‌లు – ఇద్ద‌రు ఉద్యోగులు మృతి

శిర్డీ : ప్రసిద్ధ సాయిబాబా ఆలయం ఉన్న షిర్డీలో దొంగలు చెలరేగిపోయారు. పలు ప్రాంతాల్లో దోపిడీకి యత్నించారు. ఈ నేపథ్యంలో సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు కత్తిపోట్లకు గురై మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్ర అహల్యానగర్ జిల్లాలోని షిర్డీలో ఈ సంఘటన జరిగింది. తెల్లవారుజామున షిర్డీలోని పలు ప్రాంతాల్లోని ఇళ్లల్లో దొంగలు చొరబడ్డారు. దోపిడీకి యత్నించే క్రమంలో కొందరు వ్యక్తులపై కత్తులతో దాడి చేశారు.

కాగా, దోపిడి వ‌చ్చిన దొంగ‌ల‌ను సాయి ట్ర‌స్ట్ ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో సాయిబాబా ఆలయాన్ని నిర్వహించే ట్రస్ట్కు చెందిన ఇద్దరు ఉద్యోగులైన 43 ఏళ్ల సుభాష్ సాహెబ్రావ్ ఘోడే, 45 ఏళ్ల నితిన్ కృష్ణ షెజుల్, పై దొంగల కత్తితో దాడి చేశారు.. దీంతో వారిద్ద‌రూ మ‌ర‌ణించారు.. శ్రీకృష్ణ నగర్కు చెందిన కృష్ణ దేహార్కర్ పై కూడా ఆ దుండగులు కత్తితో దాడి చేయగా అతడు గాయపడినట్లు చెప్పారు. దొంగలు గంట వ్యవధిలో మూడు చోట్ల దోపిడీల‌కు, దాడులకు పాల్పడినట్లు వెల్లడించారు.


మరోవైపు ఈ సంఘటనలకు సంబంధించి షిర్డీలోని శ్రీరామ్ నగర్కు చెందిన కిరణ్ న్యాండియో సదా కులేను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మిగతా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దోపిడీ కోసమే కత్తి దాడులు జరిగాయని, మరే ఇతర కారణాలు లేవని పోలీస్ అధికారి స్పష్టం చేశారు. నిందితులపై గతంలో కూడా పలు కేసులు నమోదైనటు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *