గ్రామంలోకి వచ్చిన ఆరోగ్య సేవలు

గ్రామంలోకి వచ్చిన ఆరోగ్య సేవలు
వెల్దండ ఆంధ్రప్రభ: వెల్దండ మండల సమీపంలోని కొట్ర గ్రామపంచాయతీలో సర్పంచ్ శారద చెన్నయ్య ఆధ్వర్యంలో మహిత హాస్పిటల్ సహకారంతో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య బృందం ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించింది.
అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మహిత, డాక్టర్ శివరామ్, వైద్య బృంద సభ్యులు, ఉప సర్పంచ్ నారుమల్ల అన్నమ్మ, వార్డు సభ్యులు కొప్పు మల్లేష్, జెనిగల సాయి యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జెనిగల మల్లయ్య, కోట్ల శ్రీను, గ్రామస్తులు పాల్గొన్నారు.
