మున్సిపల్ కార్మికుల ధర్నా

మున్సిపల్ కార్మికుల ధర్నా
వికారాబాద్, ఆంధ్రప్రభ : మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు26000 ఇవ్వాలనీ, హెల్త్ కార్డులు ఇవ్వాలి, బట్టల కుట్టుకూలి 1200 ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజా చౌరస్తా వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. రిపేర్ లో ఉన్న ఆటోలు ట్రాక్టర్లు వెంటనే రిపేర్ చేయించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 20 లక్షలు ఇవ్వాలి. పెన్షన్స్ సౌకర్యం నెలకు పది వేలు ఇవ్వాలని అన్నారు.
నేడు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మహిపాల్ మాట్లాడుతూ.. గతంలో కార్మికులు పోరాడి తెచ్చుకున్న కార్మిక చట్టాలను నీరుగారిస్తునా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలి. 8 గంటల పని విధానం కొనసాగించాలని వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన తెలియచేశారు.
మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనీ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నేటి నుండి నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వికారాబాద్ లో 34 వార్డులు, 10 జోన్లు, ఉన్నవి. కార్మికుల సంఖ్య 264 నుండి 400 మంది వరకు పెంచాలి అన్నారు.
ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ CITU వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, నాయకులు బుచ్చయ్య జ్యోతి, జాఫర్ రవి, ఇలియాస్ మంగమ్మ, లచ్చమ్మ, నరిసింహులు, శివ కుమారు, ఆశ రాఘవేంద్ర, సామిల్, కమల, బుచ్చయ్య, జంగమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు.
