నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: సీఐ పులి రమేశ్

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: సీఐ పులి రమేశ్

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ఎల్కతుర్తి మండల కేంద్రంలోని రాజరాజేశ్వర ఫర్టిలైజర్, పెస్టిసైడ్ అండ్ సీడ్స్ దుకాణాన్ని ఎంఏఓ రాజ్‌కుమార్, సీఐ పులి రమేశ్, ఎస్సై నరసింహారావు శుక్రవారం సంయుక్తంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విత్తన వ్యాపారులు చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే అందించాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వం నిషేధించిన బీటీ-3 విత్తనాలు, నకిలీ విత్తనాలు, నిషేధిత పురుగుమందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులను మోసం చేసే వ్యాపారులను ఉపేక్షించబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply