11 kv Lines Damage : ఈదురు గాలుల బీభత్సం Andhra Prabha Top News

11 kv Lines Damage : ఈదురు గాలుల బీభత్సం Andhra Prabha Top News

  • నేలకోరిగిన చెట్లు
  • కూలిన కరెంటు స్తంభాలు
  • 11 కేవీ తెగిపడిన విద్ముత్తు తీగలు

(చిలకలూరిపేట , ఆంధ్రప్రభ)

11 kv Lines Damage : పసుమర్రు రూరల్ లో గురువారం అర్ధరాత్రి ఇచ్చిన ఈదురు గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. కొన్నిచోట్ల చెట్లు రోడ్డుకి అడ్డంగా పడిపోయాయి. వివరాల్లోకెళ్తే పసుమర్రు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ రోడ్డులో పలుచోట్ల ఈదురుగాలి బీభత్సం సృష్టించడంతో విద్యుత్ స్తంభాలు పడిపోయి విద్యుత్ తీగల కూడా మొక్కలు ముక్కలైపోయిన సంఘటన చోటుచేసుకుంది. అదేవిధంగా చిలకలూరిపేట నుంచి పసుమర్రు వెళ్ళు డొంక రోడ్డు లో పలుచోట్ల తాటి చెట్లు ఈదురుగాల బీభత్సానికి నేలగోరిగాయి.


ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ దగ్గర ఎక్కువగా తాటి చెట్లు ఉండటంతో విద్యుత్ స్తంభాలు కొద్దిపాటి గాలికే పడిపోయే సందర్భాలు ఉన్నాయి. పలుచోట్ల తాటి చెట్లు ఎక్కువగా ఉండటంతో ఈదురు గాలులకు అవి రాసుకుని గురువారం రాత్రి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అదే సమయంలో వాన కూడా పడటంతో మంటలు ఆరిపోయాయి. సమీపంగా ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ, ప్లాస్టిక్ బాటిల్ ఫ్యాక్టరీ, ఇంకొన్ని వట్టివేరు ఫ్యాక్టరీ వంటి చిన్న తరహా పరిశ్రమలు ఉండటంతో తరచూ విద్యుత్ సమస్యలు ఏర్పడుతున్నాయని విద్యుత్ శాఖ ఈ సమస్యలపై దృష్టి పెట్టి విద్యుత్ స్తంభాలు నెలకు వరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సమస్య మళ్లీమళ్లీ పునరావతం కాకుండా పరిష్కరించాలని పసుమర్రు గ్రామ ప్రజలు కోరుతున్నారు

11 kv Lines Damage : హైవే పక్కన అలజడి

జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఏఎంజీ ప్రక్కన గల డొంకలో ఇటీవల కాలంలో నూతనంగా వేసిన రేకుల షెడ్డు గురువారం రాత్రి వీచిన రాక్షసయుదురుగాలులకు షెడ్డు పైకప్పు అమాంతం ఎగిరి పక్కనే ఉన్న స్థలాల్లోకి పడిపోయింది. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు

Leave a Reply