New Glen | లాంచ్ ప్యాడ్‌పైనే పేలిన రాకెట్

New Glen | లాంచ్ ప్యాడ్‌పైనే పేలిన రాకెట్

బ్లూ ఆరిజిన్‌కు భారీ ఎదురుదెబ్బ

New Glen | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : బ్లూ ఆరిజిన్‌ సంస్థకు చెందిన రాకెట్ పరీక్ష సమయంలో పేలిపోవడం సంచలనంగా మారింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని కేప్ కెనావెరాల్ ప్రయోగ కేంద్రంలో నిర్వహించిన హాట్‌ఫైర్ పరీక్షలో ‘న్యూ గ్లెన్’ రాకెట్ లాంచ్‌ప్యాడ్‌పైనే పేలిపోయింది. ఈ ఘటనతో ప్రయోగ కేంద్రం వద్ద భారీ మంటలు చెలరేగాయి.

రాకెట్ ఇంజిన్ల పనితీరును పరీక్షించే హాట్‌ఫైర్ టెస్ట్ నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు సంస్థ తెలిపింది. పేలుడు ధాటికి లాంచ్‌ప్యాడ్ ప్రాంతమంతా అగ్నిగోళంలా మారగా, మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఈ ప్రమాదంలో సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని బ్లూ ఆరిజిన్ వెల్లడించింది. అయితే ప్రయోగ కేంద్ర పరిసరాల్లో గణనీయమైన నష్టం జరిగినట్లు సమాచారం. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు సంస్థ సాంకేతిక బృందాలు విచారణ ప్రారంభించాయి. ఈ ఘటనపై స్పందించిన జెఫ్‌ బెజోస్‌.. “ఇది మాకు కఠినమైన రోజు” అని వ్యాఖ్యానించారు. సమస్యలను విశ్లేషించి మరింత బలోపేతంగా ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply