గోదావరితీరం.. భక్తజన సంద్రం..

గోదావరితీరం.. భక్తజన సంద్రం..
బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర గోదావరి నది తీరం శుక్రవారం భక్తజన సంద్రంగా మారింది. తెలుగు రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నది తీరాన గల శివాలయంలో ప్రత్యేక అభిషేక అర్చన పూజలు నిర్వహించారు. గోదారమ్మకు తెప్పలు వదిలి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం భక్తులు అమ్మవారి దర్శననికి క్యూ లైన్ లో బారులు తీరారు. అమ్మవారి సన్నిధిలోని అక్షరాభ్యాస మండపంలో భక్తులు తమ చిన్నారులకు ఆలయ అర్చకులచే అక్షరాభ్యాస పూజలు జరిపించి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
