ఇద్దరు ఫారెస్ట్ రేంజు ఆఫీసర్ల బదిలీలు..

ఇద్దరు ఫారెస్ట్ రేంజు ఆఫీసర్ల బదిలీలు..
జన్నారం, ఆంధ్రప్రభ: ఇద్దరు ఫారెస్ట్ రేంజు ఆఫీసర్లను బదిలీ చేస్తూ, ఇద్దరు కొత్తవారిని ఉన్నతాధికారులుగా కౌన్సిలింగ్ ద్వారా నియమించారు. మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్ రిజర్వ్ లోని జన్నారం అటవీ డివిజనల్ పరిధిలోని తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి.సుష్మారావును, జన్నారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె.లక్ష్మీనారాయణను బదిలీ చేశారు.
సుష్మారావును హైదరాబాద్ లోని ఎంఐఎస్ కు బదిలీ చేశారు. ఆమె స్థానంలో హైదరాబాద్ లోని ఫారెస్ట్ అకాడమీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరుగా పని చేస్తున్న ఖాదర్ అలీని నియమించారు. కె. లక్ష్మీనారాయణను కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు బదిలీ చేశారు. అతని స్థానంలో మెదక్ జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వికాస్ ను నియమించారు. వీరంతా వచ్చే నెల 10 వరకు రిలీవై, జాయిన్ కానుకానున్నారు.

