Road Accident | ఒకరి మృతి..

Road Accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఎన్టీఆర్ జిల్లాలోని ఏ కొండూరు మండలం గోపాలపురం వద్ద ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను కారు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా, బైక్ పూర్తిగా తగలబడిపోయింది.

ప్రమాద సమయంలో బైక్‌కు ఒక్కసారిగా మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

మృతుడు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కోండ్రుపాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply