Muttukuru | గుర్తు తెలియని శవం లభ్యం

Muttukuru | గుర్తు తెలియని శవం లభ్యం
కృష్ణపట్నం సముద్ర తీరం వెంబడి గుర్తింపు
Muttukuru | ముత్తుకూరు, ఆంధ్రప్రభ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (Nellore District) సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కృష్ణపట్నం సముద్ర తీరం వెంబడి గురువారం గుర్తు తెలియని పురుషుడు(45) మృతదేహాన్ని కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని స్థానిక ఎస్సై జేపీ శ్రీనివాస్ రెడ్డి (JP Srinivas Reddy) తెలిపారు. సముద్రంలో కొట్టుకొచ్చిన మృతదేహాన్ని ఎస్ఐ పరిశీలించారు. శవం బాగా ఉబ్బిపోయి ఉంది. సముద్రంలో వేటకు వచ్చినవారు ఎవరైనా ప్రమాదవశాత్తు పడిపోయి మరణించి ఉంటారని ప్రాథమికంగా పోలీస్ శాఖ అనుమానిస్తుంది.
గుర్తుతెలియని మృతదేహం సమాచారాన్ని స్థానిక పోలీస్ శాఖ (Police Department) ఎస్సై జేపీ శ్రీనివాస్ రెడ్డి తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల ప్రాంతాల్లోని కల్లూరు, కాశిమేడు మత్స్యకారులు సంఘాలకు తెలియజేశారు. అదేవిధంగా జిల్లాలోని తీరప్రాంత పోలీస్ శాఖతో పాటు మెరైన్ పోలీస్ స్టేషన్ల అధికారులకు ఎస్ఐ సమాచారం అందించారు. ఎవరైనా అదృశమై ఉండి, మతిస్థిమితం లేక వెళ్లిపోవడం, సముద్రపు స్నానాలు వచ్చి తప్పిపోయి ఉంటే స్థానిక కృష్ణపట్నం (Krishnapatnam) పోలీస్ స్టేషన్ అధికారులను సంప్రదించాలని ఎస్ఐ పేర్కొన్నారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
