కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సీపీఎం నిరసన

నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఇంటిపై ఈడీ సోదాలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇది కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో భాగమేనని సీపీఎం పార్టీ ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కక్షపూరిత విధానాలను వెంటనే మానుకోవాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. శ్రీనివాసులు, జిల్లా కమిటీ సభ్యులు ఎం. శ్రీనివాసులు, పొదిల రామయ్య, సీపీఎం మాజీ ఎంపీటీసీ ఏ. యాదయ్య, జిల్లా నాయకులు మధు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శివశంకర్, సీపీఎం సీనియర్ నాయకులు కేతేపల్లి సత్యనారాయణ, వెంకటేష్, మల్లికార్జున్, లక్ష్మయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
