Tributes | ఎన్టీఆర్‌కు ఘాట్ వద్ద నివాళులు..

Tributes | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : దంపతులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.
“రాజకీయాలు అంటే ప్రజా సేవ అని రుజువు చేసిన మహానేత ఎన్టీఆర్” అని పురందేశ్వరి పేర్కొన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా ఎన్టీఆర్ ఆశీస్సులు అందరిపై ఉంటాయన్నారు. ఎన్టీఆర్ విగ్రహాల స్థాపన ఇప్పుడు ఒక పరిపాటిగా మారిందని తెలిపారు.
ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని పురందేశ్వరి కొనియాడారు. “ఎన్టీఆర్‌ది మరణం లేని జననం. మా కుటుంబంపైనే కాదు.. అందరిపైనా నాన్న ఆశీర్వాదం ఉండాలి” అని ఆమె భావోద్వేగంగా అన్నారు.
