త్యాగం, సహనం, సౌభ్రాతృత్వానికి ప్రతీక బక్రీద్

త్యాగం, సహనం, సౌభ్రాతృత్వానికి ప్రతీక బక్రీద్

  • పలువురు ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసిన సి.ఐ రవి కుమార్

హన్మకొండ క్రైమ్, ఆంధ్రప్రభ : బక్రీద్ అంటే కేవలం పండుగ మాత్రమే కాదని త్యాగానికి, సహనానికి,పేదలను ఆదుకునే గుణానికి, సమానత్వానికి గుర్తు అని అన్నారు కే.యూ.సి.సిఐ రవికుమార్. కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జరుపుకోవాల్సిన మానవతా పండుగ అని తెలుపుతూ పలువురు ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు ముస్లిమ్ లకు దుస్తులు పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మన ఐక్యతే మన బలం బక్రీద్ స్ఫూర్తితోహిందూ-ముస్లిం-క్రైస్తవులం అంతా కలిసి ఉండాలి అన్నారు . మన అన్ని మతాల వారు కలిసి ఉంటు అని పండుగలు కలిసి జరుపుకుంటూ మతసామరస్యన్ని కాపాడుకుందాం మానవత్వాన్ని నిలబెడుతూ మన ఐక్యతను కాపాడుకుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply