బాల్యవివాహాలనిర్మూలన జిల్లాగా తీర్చిదిద్దుదాం.

బాల్యవివాహాలనిర్మూలన జిల్లాగా తీర్చిదిద్దుదాం.

మహిళలభద్రతకోసమే జెండర్ రిసోర్స్ సెంటర్ ఏర్పాటు.
మహిళా సాధికారతకు కృషి చేయాలి.
ఉచితకుటుంబసలహాకేంద్రం వినియోగించుకోవాలి.
నారాయణపేటడీఆర్‌డీవో వెంకట్ రాములు.

ఊట్కూర్, (ఆంధ్రప్రభ) బాల్య వివాహాల నిర్మూలన జిల్లాగా జిల్లాను తీర్చిదిద్దుదామని ప్రభుత్వం మహిళల భద్రత కోసమే జెండర్ రిసోర్స్ కేంద్రం ప్రారంభించిందని ఉచిత కుటుంబ సలహా కేంద్రం సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట డిఆర్డివో వెంకట్ రాములు అన్నారు. మహిళా సాధికారిక సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలనిఅన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో జెండర్ రిసోర్స్ సెంటర్- గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థఆధ్వర్యంలో కమ్యూనిటీ నిర్వహణలో ఏర్పాటు చేసిన ఉచిత కుటుంబసలహా కేంద్రం, జెండర్ రిసోర్స్ సెంటర్‌ను సర్పంచ్ ఎం రేణుక భరత్ తో కలిసిప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్‌డీవో వెంకటరాములు మాట్లాడుతూ మహిళల భద్రత, బాలికల విద్య, గృహ హింస నిర్మూలనకు సమాజం కలిసి పనిచేయాలని సూచించారు. బాల్యవివాహాలు బాల కార్మిక వ్యవస్థ జోగిని వ్యవస్థ నిర్మూలించేందుకు చేపట్టిన జెండర్ రిసోర్సెస్ సెంటర్ ఉపయోగంగా ఉంటుందన్నారు. మహిళలు అసమానతకు గురికాకుండా ఉండాలని సూచించారు. మహిళలకు న్యాయం చేసేందుకు ఇలాంటి కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించి పోతున్న తరుణంలో ప్రభుత్వం రిసోర్సెస్ కేంద్రం ప్రారంభించడం శుభసూచకమన్నారు. కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు ఓపికతో నిష్పక్షపాతంగా మహిళలకు న్యాయం చేయాలని సూచించారు.
ఆడపిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు చేయడం, బాల్య వివాహాలను అరికట్టడం, మహిళలపై హింసను ఎదుర్కోవడం, కులమత భేదాలను నిర్మూలించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు.
సామాజిక ఎజెండాలో భాగంగా గృహ హింస నిర్మూలన, బాలకార్మిక వ్యవస్థ రూపుమాపడం, మద్యపాన నియంత్రణ, మానవ అక్రమ రవాణా నివారణ, మూఢనమ్మకాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఆడపిల్లలకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత పెళ్లిళ్లు చేయాలని జెండర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం రేణుక భరత్, ఎంపీడీవో కిషోర్ కుమార్, డిపిఎం గోవింద్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు యజ్ఞేశ్వర్ రెడ్డి, ఏపిఎం హరి నారాయణ, ఏపీఓ లక్ష్మారెడ్డి, ఈసీ మహిపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శివలీల, బీజేవైఎం జిల్లా అధ్యక్షులుభరత్ మహిళా సమైక్య వివోఏలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply