ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైపుల్యం

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైపుల్యం

అకాల వర్షంతో తడిసిన ధాన్యం
పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
అధైర్య‌ప‌డొద్ద‌ని రైతులకు భరోసా

బెజ్జంకి, మే 27(ఆంధ్రప్రభ ): మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షం కారణంగా తడిసిపోయిన వరి, మక్క, పొద్దుతిరుగుడు పంటలను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్వయంగా పరిశీలించారు. స్థానిక మార్కెట్ యార్డ్‌కు వెళ్లిన ఆయన అక్కడ గుమికూడిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.

అకాల వర్షంతో పంటలు తడిసి భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నెలలు గడిచిన కొనుగోలు జాప్యం తీవ్ర నష్టం మిగిలిచ్చిదన్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం వర్షంలో తడవడంతో నాణ్యత తగ్గిపోయి, కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని రైతులు ఆరోపించారు. లారీలు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు.
ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంబంధిత అధికారులతో, ఆర్డీఓతో ఫోన్‌లో సంభాషించి వెంటనే చర్యలు తీసుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన చెప్పడతామని హెచ్చరించారు. రైతులు నష్టపోకుండా తక్షణ సహాయం అందించాలని ఆయన స్పష్టం చేశారు. అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని రసమయి బాలకిషన్ సూచించారు.

Leave a Reply