panic | వ్యూ పాయింట్ సమీపంలో…

panic | వ్యూ పాయింట్ సమీపంలో…
panic | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : శ్రీశైలం జలాశయం వద్ద చిరుతపులి సంచారం కలకలం రేపింది. నంద్యాల జిల్లాలోని జలాశయం వ్యూ పాయింట్ సమీపంలో చిరుతపులి కనిపించడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
వ్యూ పాయింట్ దగ్గర ఉన్న కేబుల్ వే రూమ్ కింద రాళ్లపై చిరుతపులి కూర్చుని కనిపించినట్లు సిబ్బంది తెలిపారు. కొంతసేపు అక్కడే సంచరించిన చిరుతను గమనించిన ఉద్యోగులు అప్రమత్తమయ్యారు.
శ్రీశైలం జలాశయం పరిసర ప్రాంతాల్లో ఇటీవల చిరుతల సంచారం పెరిగినట్లు సమాచారం. దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించగా.. చిరుత కదలికలపై నిఘా పెంచినట్లు తెలుస్తోంది.
