నిరుపేద బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

నిరుపేద బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
– కాంగ్రెస్ నేతలు భరోసా
తొర్రూరు, ఆంధ్రప్రభ :
నిరుపేద బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి తెలిపారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సహాయ కార్యక్రమం నిర్వహించారు.
వెంకటాపురం గ్రామానికి చెందిన నర్సింగోజు రుక్మిణమ్మ (70), శీలం సోమయ్య (65), దొంతు సత్యం (50) ఇటీవల మృతి చెందగా, విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించారు.
మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి, జక్కా ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి రూ.3 వేల చొప్పున మొత్తం రూ.9 వేల నగదు, అలాగే 25 కేజీల చొప్పున మొత్తం 75 కేజీల బియ్యం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు చిత్తలూరి శ్రీనివాస్, వెంకటాపురం సర్పంచ్ ధరావత్ విజయ రవి, ఉప సర్పంచ్ మొగుళ్ళ లింగన్న గౌడ్, సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
