సేవకు గుర్తింపు

సేవకు గుర్తింపు

ఆసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ:
ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా జిల్లాకేంద్రనికి చెందిన గాడిపెళ్లి హనుమాన్ చారి నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు నౌండ్ల సంతోష్ చారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాడిపల్లి హనుమాన్ చారి బాల్యం నుంచి సేవ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారని, రక్తహీనులకు పలుమార్లు రక్త దానం చేసి రక్తదాతగా పేరుపొందరని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సంఘ సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూన్నారని హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ విద్యాపరంగా విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందించి మంచి పేరు సంపాదించారని అన్నారు.

వారు మరింతగా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించాలని భావించి ఈ సముచితమైన బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు. నూతనంగా ఎంపికైన వారికి పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు డాక్టర్ అశ్విని కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ సుభాష్ చంద్రబోస్, జాతీయ వ్యవహారాల అధ్యక్షులు బ్రహ్మశ్రీ రామ్ రాజ్, జాతీయ యువజన విభాగం అధ్యక్షులు బ్రహ్మశ్రీ దిలీప్ కుమార్ శర్మ, జాతీయ అడ్వైజరీ కమిటీ సభ్యులు బ్రహ్మశ్రీ చిన్మయ చారి తదితరులు అభినందనలు తెలిపారు.

Leave a Reply