మహిళల ఆర్థిక సాధకారతే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం..

కేసముద్రం, ఆంధ్రప్రభ : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యచరణలో భాగంగా నేడు కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఎంపీడీవో కార్యాలయంలో పట్టణ పేదరిక సంస్థ-మెప్మా ఆధ్వర్యంలో ఓంకారేశ్వర పట్టణ సమైక్య సర్వసభ సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత, వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ ముఖ్యఅతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెప్మా విభాగానికి సంబంధించిన ఏ సమస్య వచ్చిన వాటి పరిష్కారానికి పురపాలక సంస్థ ముందుంటుందని తెలిపారు.

మహిళల ఆర్థిక సాధకారతే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలలు ఉపాధి సాధించి కుటుంబాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలను ఆర్థికంగా బలాపేతం చేయడానికి ప్రభుత్వం వడ్డీలేని రుణాలు, సబ్సిడీలు, అందిస్తూ వారి జీవితాల్లో భరోసా కల్పిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ అమలు చేస్తున్న మహిళ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి శ్రీనివాసరావు , డిఎంసి విజయ , అధ్యక్షురాలు అనిత , కార్యదర్శి పూలమ్మ , కోశాధికారి శ్యామల , మున్సిపాలిటీ ఆర్పీలు, సమైక్య అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply