Chief Minister | ధాన్యం కొనుగోలుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Chief Minister | ధాన్యం కొనుగోలుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Chief Minister | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌ : కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం నష్టాలను భరించేందుకైనా వెనుకాడదని స్పష్టం చేశారు.

ఈసారి మొక్కజొన్న దిగుబడి బాగా వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ పంటను సేకరించడం లేదు. దీంతో ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతులను ఆదుకునేందుకు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

ఇవాళ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో సీపీఎం నేతల బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయ అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.

Leave a Reply