పాలీసెట్ ర్యాంకర్ ను అభినందించిన డీఈఓ..

జన్నారంరూరల్, ఆంధ్రప్రభ : టీజీ పాలీసెట్ లో రాష్ట్రస్థాయిలో 28వ ర్యాంకు సాధించిన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని జాడి ఆంజనేయప్రసాద్ ను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య ఆదివారం మధ్యాహ్నం అభినందించారు.ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. కలమడుగు ఉపాధ్యాయులు విద్యార్థులను పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే విధంగా ప్రత్యేక ప్రణాళికతో కోచింగ్ ఇచ్చారన్నారు.
గత ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాల్లో ఆంజనేయ ప్రసాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో 600 మార్కులకు 577 సాధించి జిల్లాలో ద్వితీయ స్థానం పొందాడన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తున్నారని ఆయన తెలిపారు.పాఠశాల పనితీరు పట్ల హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులందరినీ ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ విజయకుమార్,హెచ్ఎం కట్ట రాజమౌళి, గ్రామ సర్పంచి బొంతల నాగమణి-మల్లేష్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
