మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

  • మంత్రి వివేక్ వెంకటస్వామి

చెన్నూర్, ఆంధ్రప్రభ : మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 22 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

చెన్నూర్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బన్సీలాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి చెన్నూర్ పట్టణ పోలీసులు, పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా “నషా ముక్త్ భారత్ అభియాన్” పోస్టర్లను విడుదల చేసి మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.

యువత మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వ్యసనాలకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మంత్రి సూచించారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. చెన్నూర్‌ను మాదకద్రవ్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చెన్నూర్ సీఐ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, వ్యవసాయ శాఖ ఏడీఈ, పాఠశాల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.