నాణ్యమైన విద్యను అందించేది ప్రభుత్వ పాఠశాలలే..

నాణ్యమైన విద్యను అందించేది ప్రభుత్వ పాఠశాలలే..
రాప్తాడు, ఆంధ్రప్రభ : ఆహ్లాదకరమైన వాతావరణంలో కంప్యూటర్ పరిజ్ఞానం నాణ్యమైన విద్యను నాణ్యమైన భోజనంను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు మన గ్రామంలోనే ఉండగా వేరే పాఠశాలలు మనకు ఎందుకని ఎంఈఓ మల్లికార్జున పేర్కొన్నారు.రాప్తాడు మండల పరిధిలోని 16 గ్రామ పంచాయతీలలోని అన్ని గ్రామాల్లోను ఎన్రోల్మెంట్ డ్రైవింగ్ ను హెడ్మాస్టర్లు ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నారు.ఈ సంధర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ ఇంటింటికీ తిరుగుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించే విధంగా ప్రభుత్వ పాఠశాలలు కల్పించే సౌకర్యాలను గొప్పతనాన్ని నాణ్యమైన విద్య విద్యపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ఎన్రోల్మెంట్ డ్రైవింగ్ నిర్వహించిన గ్రామాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తామని పేర్లు నమోదు చేయిస్తున్నారు. బుక్కచెర్ల గ్రామంలో 10 మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారని తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు నిండుకుండలా కళకళలాడుతాయని తెలియజేశారు. వేలు లక్షల్లో ఫీజులు కట్టి ప్రైవేటు పాఠశాలల్లో చదివించిన నాణ్యమైన విద్య అందుదు అని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను మానసికంగా శారీరకంగా వేధించడంతోపాటు అనేక ఇబ్బందులు పెడతారనేది మనం చూస్తూనే ఉన్నామన్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు బి.రవీంద్ర వెంకటేశ్వర ప్రసాద్ ఉపాధ్యాయులు వెంకటనాయుడు సిఆర్ఎం టిఎస్ రామాంజనేయులు నాగభూషణం డబ్ల్యూఈఎ అపర్ణ ఆశ నాగవేణి అంగన్వాడీ జయమ్మ నాగవేణి పాల్గొన్నారు.
