నియామకం
కాంగ్రెస్ ఎస్సీ శాఖ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా శ్యాంసుందర్
కడం, మే 23, ఆంధ్రప్రభ : కడం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన కడం మాజీ వైస్ ఎంపీపీ కట్ట శ్యాంసుందర్‌ను కాంగ్రెస్ పార్టీ ఎస్సీ శాఖ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ మానకొండూరు ఎమ్మెల్యే టీపీసీసీ ఎస్సీ శాఖ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. తమకు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ శాఖ అధ్యక్షుడుగా నియమించిన టిపిసిసిఎస్సి డిపార్ట్మెంట్ చైర్మన్‌కు నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్ కు కట్ట శ్యాంసుందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందేటట్లు చూస్తామని కట్ట శ్యాంసుందర్ అన్నారు
