జంగాంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

జంగాంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

సేంద్రియ సాగు పై దృష్టి సారించాలి

జైనూర్, ఆంధ్రప్రభ : సేంద్రియ పంటల సాగుపై దృష్టి సారించాలని అంతర్పంటలతో లాభాలు ఉంటాయని పంటల మార్పిడి తో అధిక లాభాలు ఉంటాయని హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల బయోటెక్నాలజీ, కీటక శాస్త్రవేత్తలు సివి సమీర్ కుమార్, కే సతీష్ అన్నారు. శనివారం కొమరం భీ0 అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జ0గాంలో రైతులతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వ్యవసాయ సాగు విధానాలు వ్యవసాయ సాగు పంటలపై పిచికారి చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంతర్పంటల వల్ల కలిగే లాభాలు, సేంద్రియ పంట సాగు చేసే కలిగే ప్రయోజనాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ సాగులో సస్యరక్షణ చర్యలు, భూసంరక్షణ చర్యలు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జ0గాం సర్పంచ్ పెందూర్ అనసూయ అర్జున్, ఏఈఓ రాము, ప్రగతిశీల రైతు సంఘాల నాయకులు ఆత్రం దిలీప్, మాణిక్ రావు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply