సర్పంచ్ ప్రత్యేక చొరవతో తీరనున్నలో వోల్టేజీ సమస్య..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల కేంద్రంలోని గాంధీనగర్, శ్రీనివాస కాలనీలోలో వోల్టేజి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ఊట్కూర్ సర్పంచ్ ఎం. రేణుక భరత్ ప్రత్యేక చొరవతో లో వోల్టేజీ సమస్య తీర్చేందుకు శుక్రవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా ఆయా కాలనీలకు ట్రాన్స్ఫార్మర్లు లేకపోవడంతో లో ఓల్టేజీ సమస్యతో చీకట్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొన్నారు.
దీంతో తమ సమస్యను గాంధీనగర్, కాలనీవాసులు ప్రజలు సర్పంచ్ దృష్టికి సమస్య తీసుకువెళ్లగా విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ తో పలుమార్లు చర్చించి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. దీంతో గాంధీనగర్, శ్రీనివాస కాలనీలో లో వోల్టేజ్ సమస్య తీరి నాణ్యమైన విద్యుత్ సరఫరా కాదండడంతో ఆయా కాలనీలప్రజలు సర్పంచుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్టర్ కృష్ణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎం భరత్, వార్డు సభ్యులుభరత్ విద్యుత్ సిబ్బంది కోరం మల్లేష్ రెడ్డి , బిజెపి కార్యకర్తలు బాలాంజనేయులు జి పి సిబ్బంది పరశురాం, మార్కండేయ తదితరులు పాల్గొన్నారు.
